జ్యోతిష్యం : చంద్ర గ్రహణం వల్ల.. ఈ 3 రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవు..!

జ్యోతిష్యం : చంద్ర గ్రహణం వల్ల.. ఈ 3 రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవు..!

ఈ ఏడాది  ( 2026) మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం ఈ గ్రహణం మూడు రాశులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.   కేతుగ్రస్త చద్రగ్రహణం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది.  గ్రహణ సమయంలో చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయానికే అక్కడ కేతువు ఉంటాడు. ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై  తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.   ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!

కర్కాటక రాశి : ఈ రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం వలన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.  ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు.  ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.  కొత్త వస్తువులు కొనే కార్యక్రమాన్ని వాయిదే వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.  మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.  ఆఫీసులో, వ్యాపారంలో ఒడిదుడుకులు సంభవించవచ్చు. సహోద్యోగులతో విభేదాలు పెరగవచ్చు. శత్రువులు ఇబ్బందులకు గురిసే అవకాశం ఉంది.  సంబంధాలు దెబ్బతింటాయి. కడుపు సమస్యలు, రక్తపోటు సంబంధిత సమస్యలు ఉండవచ్చు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

 సింహ రాశి :  ఇదే రాశిలో కేతు గ్రస్త చంద్రగ్రహణ ఏర్పడుతుంది.   గ్రహణ ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. ప్రతి పని కూడా సవాలుగా ఉంటుంది. ఉన్నతాధికారులతో విబేధాలు ఏర్పడుతాయి. . ఆరోగ్యం విషయంలో తలనొప్పి, అలసట లేదా కంటి సమస్యలు ఆందోళన కలిగే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి  :  ఈ రాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడే సమయానికి ఐదుగ్రహాలు సంచరిస్తున్నాయి.  ఈ రాశి వారికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  ప్రతి పనిలో కూడా సమస్యలు.. అడ్డంకులు ఏర్పడుతాయి. మీ కృషికి ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఖర్చులు పెరగవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా అనిపించవచ్చు. కుటుంబ ఉద్రిక్తతలు, ప్రియమైనవారితో విభేదాలు పెరగవచ్చు. మానసిక అస్థిరత , నిద్ర లేకపోవడం కూడా ఆందోళన కలిగించవచ్చు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.